Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

మీరాబాయి చాను జీవితకథను.. సినిమాగా..

టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల 49 కేజీల విభాగంలో రజత పతకాన్ని సాధించి యావత్‌ దేశానికి స్పూర్తినిచ్చింది మీరాబాయి చాను. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోని కాచింగ్‌ గ్రామానికి చిన్న మధ్య తరగతి కుటుంబానికి చెందిన చాను జీవితకథను సినిమాగా తెరకెక్కించడానికి ఇంపాల్‌కు చెందిన స్కూటి ఫిల్మ్స్‌ ప్రొడక్షన్స్‌ ముందుకొచ్చింది. ఈ మేరకు స్కూటి ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ మీరాబాయి ఇంటికి వెళ్లి ఒప్పందాలు చేసుకుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ చైర్‌ పర్సన్‌ మనోబి ఎంఎం ప్రకటించారు.మీరాబాయి చాను జీవితకథను సినిమాగా తెరెక్కిస్తున్నామని.. ఈ చిత్రానికి తానే కథను సమకూరుస్తున్నట్లుగా తెలిపారు. ఓసీ మీరా దర్శకత్వం వహించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img