Monday, January 30, 2023
Monday, January 30, 2023

‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ విడుదల ఫిక్స్‌

హైదరాబాద్‌ : అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న సినిమా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’. కరోనా కారణంగా విడుదల పడూతూ వచ్చిన ఈ చిత్ర తాజా రిలీజ్‌ డేట్‌ను నిర్మాతలు ఫిక్స్‌ చేశారు. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జిఎ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల అన్నీ సినిమాల విడుదల తేదీలు ఖరారవుతున్న క్రమంలో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ సినిమా సైతం థియేటర్లలో అక్టోబర్‌ 8న విడుదల అవుతుందని నిర్మాతలు ధ్రువీకరించారు. హర్ష అనే ఎన్‌ఆర్‌ఐ పాత్రలో అఖిల్‌, విభా అనే స్టాండర్డ్‌ కమెడియన్‌ పాత్రలో పూజా హెగ్డే కనిపించబోతున్నారు. ఈషా రెబ్బ, మురళి శర్మ, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌, ప్రగతి, ఆమని కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. గోపీ సుందర్‌ సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటి వరకు సరైన హిట్‌ దక్కని అఖిల్‌కు ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ కీలకంగా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img