Friday, June 9, 2023
Friday, June 9, 2023

యువనటి ఆకాంక్ష దూబే ఆత్మహత్య

వారణాసి: భారతీయ చిత్ర పరిశ్రమలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. భోజ్‌పూరి యువనటి నటి ఆకాంక్ష దూబే (25) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఓ హోటల్‌లో నటి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిరది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. శనివారం రాత్రి షూటింగ్‌ పూర్తి చేసుకొని వచ్చిన ఆకాంక్ష సారనాథ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సోమేంద్ర హోటల్‌కు చేరుకుంది. కాగా ఆదివారం అదే హోటల్‌ గదిలో ఉరికి వేలాడుతూ కనిపించింది. ఆత్మహత్యకు ముందు ఆకాంక్ష స్వయంగా ఓ పాటను ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అందులో ఆకాంక్ష భోజ్‌పురి సూపర్‌స్టార్‌ పవన్‌ సింగ్‌తో కలిసి నటించింది. ఈ పాట పోస్టర్‌ను ఆకాంక్ష దూబే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. ఆకాంక్ష దూబే భోజ్‌పురి పరిశ్రమలో రాకేష్‌ మిశ్రా మ్యూజిక్‌ వీడియో ‘తు జవాన్‌ హమ్‌ లైకా’తో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఈ మ్యూజిక్‌ వీడియో చాలా విజయవంతమైంది. బుల్లెట్‌ పై జీజా, కార్వతి వంటి అనేక భోజ్‌పురి మ్యూజిక్‌ వీడియోల్లో పని చేసింది. భోజ్‌పురిలో ముజ్‌సే షాదీ కరోగి, వీరన్‌ కే వీర్‌, ఫైటర్‌ కింగ్‌ వంటి చిత్రాల్లో నటించింది. ఆకాంక్ష దూబే చాలా కాలంగా సమర్‌ సింగ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు సమాచారం. సమర్‌ సింగ్‌పై తనకున్న ప్రేమను సోషల్‌ మీడియా ద్వారా ఆమె వ్యక్తం చేసేవారు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలు ఏంటన్నది తెలియరాలేదు.
ఆకాంక్ష దూబే 1997, అక్టోబర్‌ 21న ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో జన్మించారు. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండేవారు. ఇన్‌స్టాలో ఆకాంక్ష దూబేకి దాదాపు 17 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img