Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

రజనీకాంత్‌తో ‘బాబీ’ కొత్త సినిమా!

ముంబై: మెగాస్టార్‌ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా తీసి హిట్‌ కొట్టిన యువ దర్శకుడు బాబీ (కేఎస్‌ రవీంద్ర). ఇప్పుడు మరో భారీ జాక్‌ పాట్‌ కొట్టేశాడన్న వార్త పరిశ్రమ వర్గాల్లో నలుగుతోంది. ఈ సారి ఏకంగా సూపర్‌ స్టార్‌తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడన్న వార్త టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ కోసం బాబీ పవర్‌ ఫుల్‌ కథ సిద్ధం చేశాడని ఇన్‌సైడ్‌ టాక్‌. తలైవాను వింటేజ్‌ మాస్‌ క్యారెక్టర్‌లో చూపించేలా కథ రెడీ చేశాడని, త్వరలోనే బాబీ కోలీవుడ్‌ డెబ్యూపై అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం. టాలీవుడ్‌ టాప్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు అత్యున్నత సాంకేతిక విలువలతో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించనున్నారట. రజినీకాంత్‌ ప్రస్తుతం నటిస్తోన్న జైలర్‌ సినిమా పూర్తయిన తర్వాత బాబీ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందట. త్వరలోనే మరిన్ని వివరాలపై స్పష్టత రానుందని తెలిసింది. రజినీకాంత్‌ అంటేనే స్టైలిష్‌ నటనకు చిరునామా. మరి ఏడు పదుల వయస్సు దాటిన తలైవాను బాబీ సిల్వర్‌ స్క్రీన్‌పై మాస్‌ క్యారెక్టర్‌లో ఎలా చూపించబోతున్నాడన్నదానిపై ప్రస్తుతానికి సస్పెన్స్‌ నెలకొంది. ఇదే నిజమైతే కెరీర్‌లో తక్కువ టైంలో సూపర్‌ స్టార్‌ను డైరెక్ట్‌ చేసే అవకాశం అందుకున్న యువ దర్శకుల జాబితాలో చేరిపోనున్నాడు బాబీ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img