Monday, March 27, 2023
Monday, March 27, 2023

రాజమౌళి రికార్డులకు దగ్గరా మా చిత్రం: వంశీ

హైదరాబాద్‌: టాలీవుడ్‌ స్టార్స్‌ హీరోల్లో మహేశ్‌ బాబు ఒకరు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ వర్కింగ్‌ టైటిల్‌గా ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28’అని వ్యవహరిస్తున్నారు. హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై చిన బాబు, సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర సంగతులను నాగవంశీ ప్రేక్షకులతో పంచుకున్నారు. చిత్రంపై అంచనాలను అమాంతం పెంచేశారు. ‘‘మా సినిమా ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28’ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా రూపొందుతోంది. ఈ చిత్రం అభిమానులను ఏ మాత్రం నిరాశ పరచదు. ప్రతి ఏరియాలోను రాజమౌళి రికార్డులకు దగ్గరగా మా చిత్రం వస్తుంది. మేం నిర్మించిన ‘అల వైకుంఠపురంలో’మూవీ అప్పట్లో జక్కన్న మూవీ వసూళ్లకు దగ్గరగా వచ్చింది. సినిమా స్క్రిప్ట్‌పై మాకు నమ్మకముంది. ఆ అంచనాలను చేరుకుంటుందని ఆశిస్తున్నా’’ అని నాగవంశీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ‘సార్‌’ని నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ‘సార్‌’ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ నాగవంశీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28’ లో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. జగపతిబాబు విలన్‌ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్‌ ఉన్నారు. అందులో భాగంగా శరవేగంగా షూటింగ్‌ చేస్తున్నారు.
చిత్రం కోసం రూ.10కోట్లతో రెండు భారీ ఇంటి సెట్స్‌ వేస్తున్నారు. ఈ సెట్స్‌లో షూటింగ్‌ అతి త్వరలోనే ప్రారంభం కానుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img