Sunday, February 5, 2023
Sunday, February 5, 2023

రొమాంటిక్‌ నుంచి మరోపాట

హైదరాబాద్‌ : ఆకాశ్‌ పూరి, కేతిక శర్మ జంటగా రూపొందిన ‘రొమాంటిక్‌’ సినిమా మరో పాట విడుద లైంది. ‘ఇఫ్‌ యు ఆర్‌ మ్యాడ్‌’ అంటూ సాగే ఈ పాటను రన్నింగ్‌ బస్సులో హీరో హీరోయిన్లపై రొమాంటిక్‌గా చిత్రీకరించారు. యూత్‌ను థియేట ర్లకు రప్పించడానికి ఈ సాంగ్‌ ఒకటి చాలేమో అనేంతగా పాట చిత్రీకరణ ఉంది. భాస్కర్‌ భట్ల సాహిత్యాన్ని అందించగా యాసిన్‌ నిజార్‌ – అశ్విని ఆలపించారు. ప్రేమకీ.. వ్యామోహానికి మధ్య గల తేడాను ఆవిష్కరించే కథ ఇది. ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో రమ్యకృష్ణ నటించింది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పూరి శిష్యుడు అనిల్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. పూరి సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, సునీల్‌ కాశ్యప్‌ సంగీతాన్ని అందించాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img