Saturday, February 4, 2023
Saturday, February 4, 2023

లవ్‌ స్టోరీ రిలీజ్‌ వాయిదా అందుకేనా?

హైదరాబాద్‌ : నాగచైతన్య -సాయిపల్లవి జంటగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ‘లవ్‌ స్టోరీ’ విడుదల మళ్లీ వాయిదా పడిరది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా, కరోనా కారణంగా విడుదల విషయంలో వెనక్కి వెళుతూ వచ్చింది. ఇటీవల పరిస్థితులు అనుకూలంగా మారడంతో ‘వినాయకచవితి’ కానుకగా ఈ నెల 10వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. హఠాత్తుగా ఈ నిర్ణయాన్ని మార్చు కున్నారు. ఆ రోజున థియేటర్లకు మరికొన్ని సిని మాలు క్యూ కట్టడంతోనే ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో ఒకటి రెండు సన్నివేశాలను ఇంకా బెటర్‌ గా తీయవచ్చనే ఉద్దేశంతో శేఖర్‌ కమ్ముల ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. ఆ సీన్స్‌ రీ షూట్‌ కోసం ఈ సినిమా టీమ్‌ మళ్లీ నిజామాబాద్‌ వెళుతున్నట్టుగా చెప్పుకుం టున్నారు. రీ షూట్‌ పూర్తయిన తరువాతనే రిలీజ్‌ డేట్‌ ప్రక టించే అవకాశం ఉందని అంటున్నారు. పవన్‌ సీహెచ్‌ సంగీ తాన్ని సమకూర్చిన ఈ సినిమాలో దేవయాని, ఈశ్వరీరావు, రావు రమేశ్‌ చ, పోసాని కీలక పాత్రలను పోషించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img