హైదరాబాద్ : టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా దూసు కెళ్తోంది పూజాహెగ్డే. తాజాగా ఆమె నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సక్సెస్‌తో మరింత జోరు పెంచింది. తదుపరి చిత్రాలు ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’ చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుందీ బ్యూటీ. షూటింగ్‌లకు కొంత విరామం ఇచ్చి ఇటీవల మాల్దీవులకు ట్రిప్ వేసింది. విహారం పూర్తయ్యాక షూటింగ్‌తో బిజీ అయ్యిందామె. తాజాగా ఆమె ఓ సెట్లో అడుగుపెట్టింది. అక్కడ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను కలిసింది. ఆ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ‘లెజెండ్ అమితాబ్ గారితో కలిసి పని చేయాలి, షూటింగ్లో పాల్గొనాలి అనేది నాకు ఎప్పట్నుంచో ఉన్న కల. ఇవాళ నా కలల లిస్ట్‌లో అది టిక్ పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే నేను అమితాబ్ గారితో కలిసి వర్క్ చేశాను. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది. ఇప్పటికే ఎక్కువ వివరాలు చెప్పేశాను. మరిన్ని విశేషాల కోసం వేచి చూడండి’’ అని పూజాహెగ్డే పోస్ట్ చేశారు. అయితే వీరిద్దరు కలవడానికి కారణమేంటి? ఏదైనా సినిమాలో యాక్ట్ చేస్తున్నారా? లేక యాడ్ షూట్ ఏమైనా జరుగుతుందా అన్నది తెలియాలి