Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

వచ్చేనెల్లో కళ్యాణ్‌ రామ్‌ ‘బింబిసార’?

హైదరాబాద్‌ : ఒక పక్క హీరోగానూ, మరో పక్క నిర్మాతగానూ ఫుల్‌ బిజీగా ఉన్నారు కళ్యాణ్‌ రామ్‌. తాజాగా ఆయన నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘బింబిసార’. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఒక్క అప్డేట్‌ రాలేదు. అసలు ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోందో లేదో కూడా సమాచారం లేదు. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ‘బింబిసార’ సినిమా డిసెంబర్‌లో విడుదల కానున్నట్టు సమాచారం. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిసెంబర్‌ 2న ఓ సీనియర్‌ స్టార్‌ హీరో సినిమా విడుదల కాబోతోంది. ఆ సినిమా ప్రదర్శనతో పాటు ‘బింబిసార’ విడుదల తేదీతో కూడిన ట్రైలర్‌ను విడుదల చేస్తారని తెలుస్తోంది. నిజానికి ‘బింబిసార’ సినిమా చారిత్రకం కాదు. ఇదో టైమ్‌ ట్రావెల్‌ చిత్రమట. ‘ఆదిత్య 369’ తరహాలో టైమ్‌ మెషిన్‌లో హీరో ‘బింబిసార’ పరిపాలనా కాలానికి చేరుకుంటారట. అప్పుడు జరిగే ఆసక్తికరమైన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. శ్రీ వశిష్ట్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. ఇక ఇందులో కళ్యాణ్‌ రామ్‌ సరసన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్‌ కథానాయికగా నటిస్తోంది. ‘ఎంత మంచివాడవురా’ మూవీ తర్వాత కళ్యాణ్‌ రామ్‌ నటించే చిత్రం ఇదే అవడం విశేషం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img