Monday, February 6, 2023
Monday, February 6, 2023

వచ్చేనెల 24న ‘శ్యామ్‌ సింగరాయ్‌’

హైదరాబాద్‌ : అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే ..’శ్యామ్‌ సింగ రాయ్‌’ అంటూ టీజర్‌తో వచ్చేశాడు నాని. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. తాజాగా వచ్చిన ఈ సినిమా టీజర్‌ ఆకట్టుకుంటోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఇందులో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటించారు. డిసెంబర్‌ 24న భారీ స్థాయిలో రిలీజ్‌ కాబోతున్న ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలకు మంచి ఆదరణ దర్కింది. ఈ క్రమంలోనే నిర్మా తలు చిత్ర టీజర్‌ను రిలీజ్‌ చేశారు. కలకత్తా నేపథ్యం సినిమాకు హైలెట్‌గా నిలవబోతోందని తాజాగా రిలీజైన టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. ఇక నాని పర్ఫార్మెన్స్‌ మరో లెవల్‌లో ఉండబో తోంది అని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో నానికి హిట్‌ దక్కలేదు. ఆ హిట్‌ ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమాతో దక్కబోతోందని సమాచారం. కాగా, ప్రస్తుతం నాని నటిస్తున్న ‘అంటే.. సుందరానికి’, ‘దసరా’ చిత్రాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img