Sunday, February 5, 2023
Sunday, February 5, 2023

విలన్‌గా మలయాళ స్టార్‌ హీరో

హైదరాబాద్‌ : పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఒకేసారి ఐదు సినిమాలకు కమిట్‌మెంట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ నాలుగు చిత్రాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి. వాటిలో ‘సలార్‌’ ఒకటి. ‘కేజీఎఫ్‌’తో సంచలనం సృష్టించిన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకి సంబంధించిన ప్రతీ అప్డేట్‌ అభిమానుల్ని ఊరించేదే. తాజాగా ‘సలార్‌’ సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ప్రభాస్‌కు విలన్‌గా మలయాళ స్టార్‌ హీరో పృధ్విరాజ్‌ సుకుమారన్‌ నటిస్తున్నారట. ప్రస్తుతం టాలీవుడ్‌ పాన్‌ ఇండియా మూవీస్‌లో మలయాళ నటులు వరుసగా విలన్స్‌గానూ, ప్రధాన పాత్రల్లోనూ నటిస్తున్నారు. ఆ లిస్ట్‌ లోకి ఇప్పుడు పృధ్విరాజ్‌ కూడా వచ్చి చేరారు. నిజానికి ‘కేజీఎఫ్‌’ మలయాళ వెర్షన్‌ను సొంతంగా విడుదల చేసింది పృధ్విరాజ్‌ సుకుమారనే. ‘సలార్‌’ ఎలాగూ మలయాళంలోనూ కూడా విడుదలవుతుంది. ఆ వెర్షన్‌కు క్రేజ్‌ అండ్‌ హైప్‌ తీసుకురావడానికే ప్రశాంత్‌ నీల్‌ పృధ్విరాజ్‌ ను ‘సలార్‌’ లో విలన్‌గా ఎంపిక చేశారని టాక్‌. త్వరలోనే దానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ రాబోతోంది. ‘పృధ్విరాజ్‌’ గతంలో టాలీవుడ్‌ లో ‘పోలీస్‌ పోలీస్‌’ అనే మూవీలో విలన్‌ గా నటించారు. అందులో ‘రోజాపూలు’ ఫేమ్‌ శ్రీరామ్‌ హీరోగా నటించారు. ఇప్పుడు మరోసారి సలార్‌ తో పృధ్విరాజ్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు విలన్‌గా రానుండడం విశేషాన్ని సంతరించుకుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంటోన్న సలార్‌ లో శ్రుతి హాసన్‌ కథానాయికగా నటిస్తోంది. మరి ఈ సినిమాకి పృధ్విరాజ్‌ విలనిజం ఏ స్థాయిలో హైలైట్‌ అవుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img