హైదరాబాద్: దర్శకుడు సుకుమార్ ‘పుష్ప 2’ ప్రేక్షకుల అంచనాలను అందుకో వాలని ఎంతో తపన పడుతున్నాడు. ఎండలను లెక్కచెయ్యకుండా ‘పుష్ప 2’ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడని తెలిసింది. నిన్నటి వరకు మారేడుమిల్లి అడవికి దగ్గరలో ఫహాద్ ఫాజిల్, బ్రహ్మాజీ మరికొందరిమీద వారం రోజుల పాటు షూటింగ్ చేశాడని తెలిసింది. అయితే ఈ షూటింగ్ లో కథానాయకుడు అల్లు అర్జున్ లేడని కూడా తెలిసింది. ఎందుకంటే ఈ సన్నివేశాలు అన్నీ పోలీస్ ఆఫీసర్ గా వేసిన ఫహాద్ ఫాజిల్, మిగతా పోలీస్ వారితో పాటు మరికొంత మంది ఆర్టిస్టులమీద చిత్రీకరించినట్టుగా సమాచారం.
ఇక వారం రోజులు అక్కడ చిత్రీకరించాక, హైదరాబాద్ చేరుకున్న సుకుమార్… ఇక రామోజీ ఫిలిం సిటీలో అల్లు అర్జున్ మీద ఒక పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించనున్నట్లు తెలిసింది. థాయిలాండ్ నుండి వచ్చిన సాంకేంతిక నిపుణుల అధ్వర్యంలో ఈ పోరాట సన్నివేశం చిత్రీకరిస్తారు. సుమారు నాలుగు రోజుల పాటు ఇక్కడ ఆర్.ఎఫ్.సి లో షూటింగ్ ఉండొచ్చని అంటున్నారు. తరువాత మళ్లీ సుకుమార్ మారేడుమిల్లికి వెళతాడని, అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాఆరం. ఆ తరువాత మళ్ళీ హైదరాబాద్ లో పెద్ద షెడ్యూల్ ఉంటుందని కూడా అంటున్నారు. సుకుమార్ ఇటు, అటు, గ్యాప్ లేకుండా పరిగెడుతూ ఎండలను సైతం లెక్క చెయ్యకుండా ట్రావెల్ చేస్తున్నాడు. ప్రేక్షకుల్లో ఈ ‘పుష్ప 2’ మీద చాలా అంచనాలను అందుకోవాలంటే బాగా కష్టపడాలని యూనిట్ సబ్యులకు సుకుమార్ చెప్పినట్టు కూడా తెలిసింది.