Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

‘శాకుంతలం’ విడుదల వాయిదా

హైదరాబాద్‌: గుణశేఖర్‌ దర్శకత్వంలో సమంత టైటిల్‌ రోల్‌ పోషించిన ‘శాకుంతలం’ చిత్ర విడుదల వాయిదా పడిరది. ఈ చారిత్రక చిత్రాన్ని ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నట్లు గతంలో చిత్ర బృందం ప్రకటించింది. అయితే అనివార్య కారణాల వల్ల వాయిదా వేసింది. ఈ విషయాన్ని తెలు పుతూ… నిర్మాణ సంస్థ గుణ టీమ్‌ వర్క్స్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ని షేర్‌ చేసింది. అందులో.. ‘శాకుంతలం చిత్రాన్ని ఫిబ్రవరి 17న విడుదల చేయలేమని మా ప్రియమైన ప్రేక్షకులకు తెలియ జేయడానికి చింతిస్తున్నాం. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం. మీ నిరంతర మద్దతు, ప్రేమకు ధన్యవాదాలు’ అని తెలిపింది. ఈ సినిమాలో దేవ్‌ మోహన్‌, మోహన్‌ బాబు, ప్రకాశ్‌ రాజ్‌తో పాటు పలువురు ప్రముఖులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img