Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

శ్రీవిష్ణు కొత్త సినిమా పేరు ‘సామజవరగమన’


హైదరాబాద్‌: ఫలితం ఎలా ఉన్నా కంటెంట్‌ ఉన్న కథలను ఎంచుకోవడంలో శ్రీవిష్ణు ముందు వరుసలో ఉంటాడు. జయాపజాయలతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు కొత్త తరహా కథలను పరిచయం చేస్తుంటాడు. కెరీర్‌ మొదటి నుండి శ్రీవిష్ణు విభిన్న జానర్లో సినిమాలను చేస్తూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా గతేడాది ఆయన నటించిన ‘అల్లూరి’ విడుదలై పాజిటీవ్‌ టాక్‌ తెచ్చుకుంది. కానీ కమర్షియల్‌ సక్సెస్‌ సాధించలేకపోయింది. ప్రస్తుతం శ్రీవిష్ణు ‘వివాహా భోజనంబు’ ఫేమ్‌ రామ్‌ అబ్బరాజుతో ఓ వినోధాత్మక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమ షూటింగ్‌ చివరి దశలో ఉంది. కాగా తాజాగా చిత్రబృందం ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ఏ.కే ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు ‘సామజవరగమన’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. వీణను, శ్రీవిష్ణును ఒకే దగ్గర రెడ్‌ కలర్‌ రిబ్బన్‌తో కట్టేసున్న పోస్టర్‌ సినిమాపై కాస్త ఆసక్తి రేకెత్తిస్తుంది. ఈ సినిమాలో విష్ణుకు జోడీగా బిగిల్‌ ఫేమ్‌ రెబా మోనికా జాన్‌ నటిస్తుంది. హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. గోపి సుందర్‌ స్వరకల్పనలో రూపొందుతున్న ఈ సినిమా వేసవిలో హాస్యపు జల్లు కురిపించడానికి సిద్ధమవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img