Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

షాలిని రీ ఎంట్రీ ?


బాలనటిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన షాలిని, ఆ తర్వాత హీరో విజయ్‌ నటించిన ‘కాదలుక్కు మరియాదై’ అనే చిత్రంతో హీరోయిన్‌గా మారింది.ఆ తర్వాత హీరో అజిత్‌తో కలిసి ‘అమర్కలం’ అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే అజిత్‌, షాలిని ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు.తర్వాత షాలిని వెండితెరకు పూర్తిగా దూరమయ్యారు. ఇపుడు మళ్ళీ వెండితెరపై కనిపించనున్నట్టు సమాచారం.మణిరత్నం ప్రఖ్యాత నవల ‘కల్కి’ ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తోన్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రంలో షాలిని ప్రత్యేక పాత్రలో కనిపించనున్నదనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img