Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

సెప్టెంబర్‌ 1న విజయ్‌ దేవరకొండ, సమంత ఖుషీ

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా రూపొందుతోన్న సినిమా ఖుషీ. అందమైన ప్రేమకథతో సెన్సిబుల్‌ మూవీ మేకర్‌గా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు. నిన్ను కోరి, మజిలీ వంటి సకుటుంబ ప్రేమ కథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ మరోసారి వెండితెరపై తనదైన మ్యాజిక్‌ చేయబోతున్నారు. గతంలో మహానటి చిత్రంలో విజయ్‌, సమంత కలిసి నటించారు. ఖుషీతో ఈ ఇద్దరూ జంటగా పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ రాబోతోంది. కశ్మీర్‌తో పాటు ఎన్నో అందరమైన ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 1న ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో జయరాం, సచిన్‌ ఖేడేకర్‌, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, శరణ్య ప్రదీప్‌ తదితరులు నటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img