Saturday, February 4, 2023
Saturday, February 4, 2023

స్పెయిన్‌లో షారుక్‌ ‘పఠాన్‌’

ముంబై : బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ త్వరలో స్పెయిన్‌కి వెళ్ళబోతున్నారు. మూడేళ్ల వ్యవధి తర్వాత షారుక్‌ నటిస్తోన్న చిత్రం ‘పఠాన్‌’. కరోనా త్రీవత కారణంగా ఈ సినిమా షూటింగ్‌ నెమ్మదించిన సంగతి తెలిసిందే. ఇక రెండో వేవ్‌ తర్వాత మళ్ళీ మొదలైన చిత్ర షూటింగ్‌ సరవేగంగా సాగుతోంది. ఇటీవలే దుబాయ్‌లో ఓ షెడ్యూల్‌ పూర్తి చేశారు. త్వరలో ‘పఠాన్‌’ సినిమా కొత్త షెడ్యూల్‌ను యూరప్‌లో మొదలుపెట్టడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఈ చిత్రాన్ని యూరప్‌లోని స్పెయిన్‌లోని నగరాలతో పాటు మాడ్రిడ్‌లో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తున్న ఇందులో జాన్‌ అబ్రహం విలన్‌గా నటిస్తున్నారు. కాగా గత కొన్ని రోజులుగా షారుక్‌ కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వంలో చిత్రం చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img