హైదరాబాద్ : ఎట్టకేలకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసి యేషన్(మా) ఎన్నికల తేదీ ఖరారైంది. అక్టోబరు 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ‘మా’ క్రమ శిక్షణ సంఘం తెలిపింది. దీంతో ఇక అధ్యక్ష అభ్య ర్థులు, వారి ప్యానెల్ సభ్యులు ప్రచారం ముమ్మరం చేయనున్నారు. ప్రస్తుతం అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నర సింహారావు, జీవితా రాజశేఖర్, హేమ ఉన్నారు. మరి చివరి వరకూ ఎవరు పోటీలో ఉంటారు? ఎవరు విజయం సాధిస్తారు? అన్నదానిపై ఆసక్తి నెలకొంది. నటీనటుల సమస్యల పరిష్కారంతో పాటు, ‘మా’ నూతన భవనం ప్రధాన అజెండాగా ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల ఆన్లైన్ వేదికగా ‘మా’ సర్వసభ్య సమావేశం జరిగింది. మా కార్యవర్గ ఎన్నికల నిర్వహణ అంశంపై ఈ సందర్భంగా ప్రధానంగా చర్చ జరిగింది. క్రమశిక్షణ కమిటీ ఎలా చెబితే అలా చేస్తామని ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్ కూడా తన అభిప్రాయాన్ని ప్రకటించారు.