Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

అఖండ టైటిల్‌ సాంగ్‌ విడుదల

హైదరాబాద్‌ : ముచ్చటగా మూడోసారి బోయపాటి శ్రీను-బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ’ చిత్రం నుంచి తాజా టైటిల్‌ సాంగ్‌ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్‌, టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. శంకర్‌ మహదేవన్‌, సిద్ధార్థ్‌ మహదేవన్‌, శివమ్‌ మహదేవన్‌ ఆలపించిన ఈ పాట భారీ విజువల్స్‌తో చూపరులను కట్టిపడిస్తోంది. పాట విడుదలైన కాసేపటికే యూట్యూబ్‌లో ట్రెండిరగ్‌లో నిలిచింది. సింహా, లెజెండ్‌ వంటి భారీ హిట్స్‌ తర్వాత బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలొ ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక కాగా జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్‌ సంగీతం అందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img