Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అన్ని రకాల పాత్రలు చేస్తా: సునీల్‌

హైదరాబాద్‌: సునీల్‌ ఇప్పుడు విభిన్న, విలక్షణమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. తెలుగుతో పాటు వరుస తమిళ సినిమాలు చేస్తూ ఆయన ఇంతకుముందు కంటే ఇప్పుడు బిజీగా ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో సునీల్‌ మాట్లాడుతూ… ‘‘నాకు తెలిసి సిక్స్‌ ప్యాక్‌ చేయడం కంటే నవ్వించడమే కష్టం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కామెడీ జనాలకు అందుబాటులో ఉంది’’ అన్నాడు. ‘‘నేను ఇప్పుడు ఫలానా పాత్రలను మాత్రమే చేయాలని అనుకోవడం లేదు. కొత్తదనం ఉన్న అన్ని రకాల పాత్రలు చేయాలని అనుకుం టున్నాను. ప్రస్తుతం తెలుగులో శంకర్‌ – చరణ్‌ కాంబినేషన్లోని సినిమాలోను, ‘పుష్ప 2’లోను .. ‘విరూపాక్ష’లోను .. అలాగే కమిటైన సినిమాలు మరికొన్ని ఉన్నాయి… ఇక తమిళంలో రజనీకాంత్‌ ‘జైలర్‌’, కార్తి ‘జపాన్‌’, శివకార్తికేయన్‌ సినిమాలోను, విశాల్‌ సినిమాలోను చేస్తున్నాను. ఇంకా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన మాటలు నడుస్తున్నాయి. ఇక బాలీవుడ్‌ సినిమాల నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి’’ అని చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img