Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

అప్పుడు మోహన్‌బాబు నా ఆఫర్‌ వద్దన్నారు: గుణశేఖర్‌


హైదరాబాద్‌: గతంలో నటుడు మోహన్‌బాబు తన ఆఫర్‌ను రిజెక్ట్‌ చేశారని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ అన్నారు. తాను తెరకెక్కించిన ఓ సినిమాలో కీలకపాత్ర కోసం మోహన్‌బాబుని సంప్రదించగా.. సున్నితంగా తిరస్కరించారని తెలిపారు. త్వరలో విడుదల కానున్న ‘శాకుంతలం’లో దుర్వాస మహర్షి పాత్ర కోసం మోహన్‌బాబును ఎంచుకోవడంపై గుణశేఖర్‌ స్పందిస్తూ ఈ విషయాన్ని వెల్లడిరచారు. ‘శాకుంతలం’కు మోహన్‌బాబు నా ఛాయిస్‌ కాదు. మహాకవి కాళిదాసు ఛాయిస్‌. ఎందుకంటే కాళిదాసు వర్ణన చదివిన తర్వాత.. దుర్వాస మహర్షి పాత్రకు నూటికి నూరు శాతం ఆయనే న్యాయం చేయగలడని అనిపించింది. గతంలో ‘రుద్రమదేవి’లో ఓ పాత్రకు అడిగితే ఆయన సున్నితంగా తిరస్కరించారు. దాంతో, ఆరోజు ఆయన్ని బలవంతం చేయలేదు. కానీ, ‘శాకుంతలం’ అనుకున్నాక.. ఆయన్ని కలిశాను. ‘సర్‌.. ఈసారి మీరు నో చెప్పలేని పాత్రతో వచ్చాను. ఒకవేళ మీరు చేయను అంటే ప్రత్యామ్నాయం ఎవరో మీరే చెప్పండి?’ అని అడిగాను. దానికి ఆయన ప్రాజెక్ట్‌ ఏమిటి? పాత్ర ఏమిటి? అని ప్రశ్నించగా.. ‘శాకుంతలం’లో దుర్వాస మహర్షి పాత్రని చెప్పా. వెంటనే ఆయన పెద్దగా నవ్వి.. ‘కోపిష్టి అని నా వద్దకు వచ్చావా?’ అని అడిగారు. దుర్వాసునిలో కోపం ఒక్కటే గుణం కాదు.. ఆయనో గొప్ప మహర్షి అని బదులిచ్చా. దానికి ఆయన.. ఈ పాత్ర నేనే చేస్తానంటూ అంగీకారం తెలిపారు’ అని గుణశేఖర్‌ వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img