Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఆకట్టుకుంటున్న ‘ప్రేమిస్తున్నా’ పాట

హైదరాబాద్‌: సాయిరాజేశ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటిస్తోన్న చిత్రం బేబి. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ప్రేమిస్తున్నా అంటూ సాగే మూడో సాంగ్‌ అప్‌డేట్‌ అందించిన విషయం తెలిసిందే. ఈ అప్‌డేట్‌ ప్రకారం ప్రేమిస్తున్నా లిరికల్‌ వీడియో సాంగ్‌ను రష్మిక మందన్నా విడుదల చేసింది. సురేశ్‌ బనిశెట్టి రాసిన ఈ పాటను విజయ్‌ బల్గానిన్‌ కంపోజిషన్‌లో పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ పాడాడు. ఈ చిత్రంలో విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి విజయ్‌ బల్గానిన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే బేబి నుంచి విడుదలైన ఓ రెండు మేఘాలిలా, దేవరాజా యూట్యూబ్‌లో మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌ రాబట్టి ట్రెండిరగ్‌లో నిలుస్తున్నాయి. బేబి టీజర్‌ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. బేబి చిత్రాన్ని మాస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఎస్‌కేఎన్‌ నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img