Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆ వార్తలు బాధించాయి


నటుడు, దర్శకనిర్మాత ఆర్‌.నారాయణమూర్తి
దీనస్థితిలో ఉన్నానంటూ సామాజిక మాధ్యమాల్లో తనపై వార్తలు రావడం చాలా బాధగా అనిపించింది అని నటుడు, దర్శకనిర్మాత ఆర్‌.నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న వార్తలపై ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన ‘రైతన్న’ కార్యక్రమంలో నారాయణమూర్తిని ఉద్దేశిస్తూ ‘‘ఆయనకు ఇల్లు లేదు. సొంత ఆస్తి లేదని గద్దర్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే నారాయణమూర్తి దీనస్థితిలో ఉన్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఎంతోమంది తనకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఫోన్‌లు చేయడంతో బాధపడినట్లు చెప్పారు. ‘‘నా దగ్గర డబ్బు ఉంది. నేను చాలా ఆనందంగా ఉన్నా. ఏదైనా సాయం అవసరం అయితే ఇండస్ట్రీలో చాలామంది అండగా ఉంటారు. అభిమాన దేవుళ్లు గుండెల్లో పెట్టుకుని నన్ను అభిమానిస్తున్నారు.’ అని చెప్పారు. ‘రైతన్న’ సినిమాను ఎప్పుడు విడుదల చేద్దామా అన్న ఆతురతతో ఉన్నా అని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img