Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆ హీరోయిన్స్‌ అంటే చాలా ఇష్టం: చరణ్‌


హైదరాబాద్‌: ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో రామ్‌చరణ్‌ పాపులారిటీ ఖండాతరాలు దాటిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు (రామ్‌)గా ఆయన నటనకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులుగా మారి పోయారు. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వచ్చిన దగ్గర నుంచి ఈయన పాపులారిటీ మరింత పెరిగిపోయింది. దీంతో ఎన్నో విదేశీ ఛానెల్స్‌ ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నాయి. తాజాగా ఓ ఇంట ర్వ్యూలో రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ.. తన ఇష్టమైన నటీ మణుల గురించి తెలియజేశాడు. రామ్‌ చరణ్‌ మాట్లా డుతూ ‘నాకు జూలియా రాబర్ట్స్‌ చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఆమె టీవీలో కనిపించిన ప్రతిసారీ నేను తెరకే అతుక్కుపోయేవాడిని. దానిని అబ్సేషన్‌ అంటారో లేదో తెలియదు. కానీ ఆమెలో ఏదో ప్రత్యేకత ఉంది. నేను ఆమెకు పెద్ద అభిమానిని. 1990 అమెరికన్‌ రొమాంటిక్‌ కామెడీ చిత్రం ‘ప్రెట్టీ ఉమెన్‌’లో ఆమెను చూసి ప్రేమలో పడిపోయా’ అని చెప్పుకొచ్చాడు. అలాగే చెర్రీ మరో హాలీవుడ్‌ నటి కేథరీన్‌ జీటా-జోన్స్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘రాబరీ ఆధారంగా సాగే ‘ఎంట్రాప్‌మెంట్‌’ (1999)లో కేథరిన్‌ని నటన చూసి ఫ్యాన్‌ అయిపోయా. నేను ఆమెను ఎప్పటికీ మరిపోలేను?. ఆమె నటించిన చిత్రాల్లో ‘ది మాస్క్‌ ఆఫ్‌ జోరో’ (1998) కూడా నాకు చాలా ఇష్టం. అప్పటి నుంచే ఆమెను ఫాలో అవ్వడం ప్రారంభించాను’ అని వివరించాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img