Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఉత్సాహంగా సాగిన “మ్యాడ్” సినిమా ప్రీ రిలీజ్ వేడుక

మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ  ప్రధాన పాత్రల్లో
నటించిన సినిమా “మ్యాడ్”. మోదెల టాకీస్  బ్యాన‌ర్ పై టి. వేణు గోపాల్
రెడ్డి, బి. కృష్ణారెడ్డి మరియు  మిత్రులు నిర్మాత‌లుగా  లక్ష్మణ్ మేనేని
ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 6న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు
సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా “మ్యాడ్” సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం
హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం
పాల్గొని తమ సంతోషాన్ని పంచుకున్నారు.

లిరిసిస్ట్ లక్ష్మీ ప్రియాంక మాట్లాడుతూ…చాలా సపోర్టివ్ టీమ్.
డైరెక్టర్ గారికి ఏం కావాలో క్లారిటీ ఉంది. ఫస్ట్ నుంచి ఆయన చెప్పే
వాటిలో స్పష్టత ఉండేది. పాటలు ఎలా ఉండాలో చాలా వివరంగా చెప్పేవారు.
మోహిత్ రెహ్మానియానిక్ ఇచ్చిన ట్యూన్స్ అద్భుతంగా ఉన్నాయి. నాకు ఒక్కో
పాట ఇస్తూ మొత్తంగా ఐదు పాటలు రాసే అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో హీరో
హీరోయిన్స్ లవ్ లీ పీపుల్. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఇతర టెక్నికల్
టీమ్ అంతా సూపర్బ్ గా పనిచేశారు. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు.
మ్యాడ్ చూస్తూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

నటి ఇందు మాట్లాడుతూ… మా ఇంట్లో వాళ్లు, నా ఫ్రెండ్స్ నన్ను ఆర్ యూ
మ్యాడ్ అంటారు. ఈ పోస్టర్ నాకు పంపి డైరెక్టర్ గారు పిలిచినప్పుడు చాలా
క్రేజీగా ఉంది సార్ అని వెళ్లి కథ విన్నాను. చాలా మంచి స్టోరీ. మా
డైరెక్టర్ గారు ఎప్పుడూ స్ట్రెస్ ఫీల్ అవరు. “మ్యాడ్” మూవీ కోసం పనిచేయడం
ప్లెజంట్ గా అనిపించింది. హీరో హీరోయిన్స్ తో పనిచేయడం చాలా కంఫర్ట్ గా
అనిపించింది. మా సినిమా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ద బెస్ట్. సినిమా
చూసి మమ్మల్ని విష్ చేయండి. అన్నారు.

సినిమాటోగ్రాఫర్ రఘు మందాటి మాట్లాడుతూ…నాకీ అవకాశం ఇచ్చిన దర్శకుడు
లక్ష్మణ్ గారికి థాంక్స్. చాలా సందడిగా, అల్లరిగా, హడావుడిగా మా సినిమా
షూటింగ్ సాగింది. ఈ సినిమాకు వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఆడియెన్స్
బ్లెస్సింగ్స్ కోసం ఎదురుచూస్తున్నాం. అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఏలూరు శ్రీను మాట్లాడుతూ…సినిమా మీదున్న
ప్యాషన్ తో నేను సినిమా చేద్దామనుకుంటున్న టైమ్ లో లక్ష్మణ్ గారిని
కలవడం, అలా సినిమా స్టార్ట్ చేశాం. థియేటర్ లో విడుదల చేద్దామనే
ఉద్దేశంతోనే ఇన్నాళ్లూ రిలీజ్ ఆపాం. న్యూ ఏజ్ కపుల్స్ స్టోరీ ఇది. వాళ్ల
మ్యారేజ్ లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా డీల్ చేశారని చూపించాం. మా
ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

సంగీత దర్శకుడు మోహిత్ రెహ్మానియానిక్ మాట్లాడుతూ…”మ్యాడ్” చిత్రంలో
సూఫీ పాట కంపోజ్ చేశాం. ఇది హిందీలోనే రాయించి, అలాగే చిత్రంలో ఉంచాం.
కైలాష్ ఖేర్ గారు ఆ పాటను అద్భుతంగా పాడారు. ఈ సినిమా మ్యూజిక్ కోసం నేను
చెప్పిన రిక్వైర్ మెంట్స్ కు దర్శకుడు లక్ష్మణ్ గారు చాలా సపోర్ట్
చేశారు. సినిమా కోసం తప్పకుండా చేద్దామని ముందుకొచ్చారు. “మ్యాడ్” మీరు
వచ్చి చూసి మర్చిపోయే సినిమా కాదు. అలా గుర్తుండిపోతుంది. విక్రమసింహా
అనే సినిమా తర్వాత సింగర్ ఉన్నికృష్ణన్ మా సినిమాలో పాట పాడారు. ఈ
చిత్రంతో నాకు దక్కిన అదృష్టం అనుకుంటున్నాను. ప్లీజ్ కం అండ్ వాచ్  అవర్
మూవీ. అన్నారు.

ఈ సందర్భం గా దర్శకుడు లక్ష్మణ్ మేనేని మాట్లాడుతూ… మా ఫ్రెండ్స్
సపోర్ట్ తో “మ్యాడ్” సినిమా చేశాను. ఈ సినిమా చేసి వెళ్లిపోదాం
అనుకున్నాను. కానీ మా కాస్ట్ అండ్ క్రూతో ఒక అనుబంధం ఏర్పడింది.
ఇక్కడికొచ్చాక తెలిసింది ఇంత ప్రాణం పెట్టి సినిమా చేస్తారా అని.
“మ్యాడ్” మూవీ ఒక ఫీస్ట్ లా ఉంటుంది. రెగ్యులర్ చిత్రంలా ఉండదు. సినిమా
చూసి బాగుంటే చాలా బాగుందని చెప్పండి. థాంక్స్ టు ఆల్. అన్నారు.

నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ….రిలీజ్ ముందు వరకే చిన్న సినిమా
పెద్ద సినిమా రిలీజ్ అయ్యాక ఇదే పెద్ద సినిమా కావొచ్చు. దర్శకుడు
లక్ష్మణ్ గారు యూత్ ఫుల్ సినిమా చేశారు. సినిమాను బాగా ప్రమోట్
చేస్తున్నారు. ఈ నెల 6న ఆరు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. “మ్యాడ్” మూవీ
ఆ ఆరు సినిమాల్లో ఒకట్రెండు స్థానాల్లో నిలవాలని కోరుకుంటున్నా. ఈ సినిమా
అన్ని సెంటర్స్ లో మంచి థియేటర్స్ దొరికాయి. “మ్యాడ్” మంచి విజయం
సాధించాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. అన్నారు.

హీరో మాధవ్ చిలుకూరి మాట్లాడుతూ.. మా సినిమాకు పెద్ద గెస్ట్ మీడియానే.
చిన్న సినిమాను బయటకు తీసుకెళ్లేది మీరే. మా చిన్న సినిమాకు ఇదే పెద్ద
ఈవెంట్. మీ సపోర్ట్ కావాలి. మేమంతా చాలా హోప్స్ పెట్టుకుని ఈ సినిమా
చేశాం. కరోనా వల్ల థియేటర్స్ క్లోజ్ అయినప్పుడు మేమంతా డిప్రెషన్ లోకి
వెళ్లాం. ఇవాళ మా “మ్యాడ్” మూవీ థియేటర్ లో రిలీజ్ అవుతుండటం చాలా
సంతోషంగా ఉంది. థియేటర్ లో మా చిత్రాన్ని చూడండి. అన్నారు.

హీరో రజత్ రాఘవ్ మాట్లాడుతూ… సినిమా బాగుందంటే ఆ చిత్ర విజయాన్ని ఎవరూ
ఆపలేరు. ఆ విషయాన్ని నమ్మే మేము మీ ముందుకు వస్తున్నాం. సోషల్ మీడియాలో
మా మూవీని తిట్టడంతో స్టార్ట్ చేసి, ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. మా
సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ లాంటి కంటెంట్ వాళ్లకు బాగా నచ్చింది.
“మ్యాడ్” సినిమా చూస్తేనే మీకు దర్శకుడు చిత్రంలో ఏం చెప్పబోతున్నాడో
అర్థమవుతుంది. కానీ సినిమా చూడకుండానే కామెంట్స్ పెట్టకండి. సినిమా చూశాక
మీకు అనిపించింది చెప్పండని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను శ్రీవల్లి అనే
సినిమా చేశాను. శ్రీవల్లి సినిమాకు నేను డబ్బులు పెట్టానని అంతా అపార్థం
చేసుకున్నారు. కానీ నేను డబ్బులు పెట్టలేదు. వాళ్లు అడగలేదు. ఆ తర్వాత
నాకు సినిమాలు లేవు. “మ్యాడ్” మూవీ మీద నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను.
ఆడియెన్స్ సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

శ్వేత వర్మ మాట్లాడుతూ… పీఆర్వో జీఎస్కే మీడియాకు థాంక్స్. సినిమాను
బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీ కోసం చాలా ఆత్రుతగా
ఎదురుచూస్తున్నాను. “మ్యాడ్” అనేది ఒక అద్భుతమైన సినిమా. నేను ఆల్రెడీ
చూశాను. గుడ్ ఫీల్ ఇస్తుంది. నాకీ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్.
సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. లక్ష్మణ్ గారికి ఫస్ట్ మూవీ అయినా, ఆయనకు
సినిమా మేకింగ్ మీద చాలా స్పష్టత ఉంది. పుట్టినప్పటి నుంచి చచ్చేవరకు
అనుబంధాలతో మన జీవితం ముడిపడి ఉంటుంది. ఇదొక పుస్తకం లాంటిది. కానీ ఇవాళ
చిన్న తప్పు జరిగితే జీవితమనే పుస్తకాన్నే చింపేస్తున్నారు. “మ్యాడ్”
ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీకు నచ్చితే సోషల్ మీడియాలో షేర్ చేయండి.
అన్నారు.

నిర్మాత కృష్ణారెడ్డి మాట్లాడుతూ…మా సినిమాకు వేణుగోపాల్ రెడ్డి గారు
రియల్ ఫిల్లర్   అన్నారు. మా పదేళ్ల కల “మ్యాడ్” సినిమా. మా కాస్ట్ అండ్
క్రూ గురించి చెబితే మమ్మల్ని మేము పొగుడుకున్నట్లు అవుతుంది. ఈ సినిమా
సక్సెస్ అయితే చాలా మందికి హోప్ ఇవ్వగలం అనుకుంటున్నాం. అన్నారు.

స్పందన పల్లి మాట్లాడుతూ….ఇలాంటి బ్యూటిఫుల్ క్యారెక్టర్ లో నటించాలని
ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. “మ్యాడ్” సినిమాలో నా డ్రీమ్ క్యారెక్టర్
ఇచ్చిన దర్శకుడు లక్ష్మణ్ గారికి థాంక్స్. రెండేళ్లు వేచి చూస్తున్నాం
సినిమా విడుదల కోసం. “మ్యాడ్” సూపర్ హిట్ ఫిల్మ్, ఇందులో ఏ డౌట్ లేదు.
అన్నారు.

“మ్యాడ్” చిత్రానికి ప్రొడ్యూస‌ర్స్‌ : టి. వేణుగోపాల్ రెడ్డి, బి.
కృష్ణా రెడ్డి & మిత్రులు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శ్రీనివాస్
ఏలూరు, కెమెరా : రఘు మందాటి, ఎడిట‌ర్‌ : మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం :
మోహిత్ రెహ్మానియాక్, లిరిక్స్‌ : ప్రియాంక, శ్రీరామ్ ,పి ఆర్ ఒ : జియస్
కె మీడియా.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img