Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఏడాదిన్నర ఇంట్లోనే ఉన్నా: శ్రీనివాస్‌

ముంబై: తన తొలి చిత్రం ‘అల్లుడు శీను’ హిట్‌ అందుకున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏడాదిన్నరపాటు తాను ఇంట్లోనే ఉన్నానని నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తెలిపారు. ఆర్థిక సమస్యలతో ఆ సమయంలో కెరీర్‌పై దృష్టి పెట్టలేకపోయానని ‘ఛత్రపతి’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడిరచారు. ‘‘నా తండ్రి నిర్మాత కావడం వల్లే నేను సినిమాల్లోకి సులభంగా రాగలిగానని అందరూ అంటుంటారు. అది నిజమే. నా తొలి చిత్రం ‘అల్లుడు శీను’కు ఆయన నాకెంతో సపోర్ట్‌గా నిలిచారు. అయితే, ఆయన సపోర్ట్‌తోపాటు నా హార్డ్‌వర్క్‌ కూడా ఉండటం వల్లే ఈ స్థాయిలో ఉన్నాను. ఇక.. ఆ సినిమాలో నటించడానికి సమంత, తమన్నా వంటి స్టార్‌ హీరోయిన్స్‌ ఎందుకు అంగీకరించారనేది ఎవరికీ తెలియదు. ‘అల్లుడు శీను’ ప్రాజెక్ట్‌ ఓకే అనుకున్నాక.. సమంత, తమన్నాకు నా డ్యాన్స్‌, డైలాగ్‌ డెలివరీ తెలియజేసేలా ఒక డెమో వీడియో క్రియేట్‌ చేసి పంపించాను. నా హార్డ్‌వర్క్‌ను చూశాకే వాళ్లు సినిమా ఓకే చేశారు. ఆ సినిమా విజయం సాధించి.. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అదే సమయంలో మా నాన్న ఓ సినిమా నిర్మించారు. అది బాక్సాఫీస్‌ వద్ద నిరాశనే మిగిల్చింది. అలాగే, డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన ఎనిమిది సినిమాలు వరుసగా ఫెయిల్‌ అయ్యాయి. దాంతో మా కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. వాటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు. దాంతో నాపై ఒత్తిడి పెరిగింది. అప్పుడు ఎన్నో అవకాశాలు వచ్చినా సినిమాలు చేయలేదు. అలా, ఏడాదిన్నర పాటు ఇంట్లోనే కూర్చున్నా. తర్వాత తక్కువ బడ్జెట్‌లో రెండో సినిమా చేశా. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘జయ జానకీ నాయక’ వల్ల అన్నివిధాలుగా నిలదొక్కుకోగలిగాను.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img