Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఐఫాలో సత్తాచాటిన గంగూబాయి కఠియావాడి

ముంబై: ఏడాది క్రితం వచ్చిన గంగూబాయి కఠియావాడి ఇండియన్‌ బాక్సాఫీస్‌పై తీవ్ర సంచలనమే సృష్టించింది. సంజయ్‌లీలా భన్సాలీ విజన్‌కు, ఆలియాభట్‌ నటనకు ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. కలెక్షన్‌లే కాదు అవార్డులు సైతం గంగూబాయికి దాసోహం అయ్యాయి. నెల రోజల కిందట జరిగిన 68వ ఫిలింఫేర్‌ అవార్డుల కార్యక్రమంలో ఏకంగా పది అవార్డులను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఐఫా అవార్డుల్లో మరోసారి సత్తా చాటింది. ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌-2023 వేడుక యూఏఈ రాజధాని అబుదాబిలో ఘనంగా ప్రారంభమైంది. కాగా ఈ అవార్డు ఫంక్షన్‌లో గంగూబాయి సినిమాకు మూడు అవార్డులు వరించాయి. బెస్ట్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో సంజయ్‌ లీలా భన్సాలీ, ఉత్కర్శిని వషిష్ఠ అవార్డును గెలుచుకున్నారు. ఇక బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌గా సుదీప్‌ ఛటర్జీ అవార్డు అందుకున్నాడు. ప్రకాష్‌ కపాడియా-ఉత్కర్శిని వషిష్ఠ బెస్ట్‌ డైలాగ్‌ విభాగంలో అవార్డు అందుకున్నారు. ఇలా మూడు విభాగాల్లో గంగూబాయి అవార్డులు కైవలం చేసుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img