Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

‘కంగువ’లో సరికొత్తగా కనిపించనున్న సూర్య

చెన్నై: కోలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువ’… సూర్య 42గా వస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తు న్నాడు. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో రాబోతున్న కంగువ టైటిల్‌ గ్లింప్స్‌ వీడియో ఇప్పటికే విడుదలై సినిమాపై ఆసక్తిని పెంచు తోంది. ఈ సినిమాలో ఇదివరకెన్నడూ కనిపించని సరికొత్త రూపంలో సూర్య కనిపించ బోతున్నట్టు గ్లింప్స్‌ చూస్తే అర్థమవుతుంది. కంగువ ఎలా ఉండబోతుందో డైలాగ్‌ రైటర్‌ మదన్‌ కర్కి వ్యాఖ్యలతో స్పష్టత వచ్చేసింది. ‘సినిమాలో వచ్చే కొన్ని పోరాట సన్నివేశాలు చూశా. అద్భుతంగా వచ్చాయి. శివ రెగ్యులర్‌ ఫార్మాట్‌లో ఈ సినిమా ఉండదు. శివ తనలోని కొత్తగా ఆవిష్కరించుకోబోతున్నారు. ఈ సినిమా కథ, సంభాషణలు చాలా బాగా వచ్చాయి. సూర్య సార్‌ యాక్టింగ్‌ అయితే పీక్స్‌ లెవల్‌లో ఉంటుంది’ అంటూ అభిమానుల్లో ఫుల్‌ జోష్‌ నింపుతున్నాడు డైలాగ్‌ రైటర్‌ మదన్‌ కర్కి. ఇప్పుడీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్‌ భామ దిశాపటానీ హీరోయిన్‌గా నటిస్తోంది. స్టూడియో గ్రీన్‌-యూవీ క్రియేషన్స్‌ తో కలిసి తెరకెక్కిస్తున్న కంగువ ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో విడుదల కానుంది. 3డీ ఫార్మాట్‌లో కూడా సందడి చేయ బోతుంది. దేవీ శ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. 2024 ప్రథమార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img