Friday, April 19, 2024
Friday, April 19, 2024

క్యారెక్టర్‌ నటుడు రాజబాబు కన్నుమూత

హైదరాబాద్‌ : తెలుగు సినిమా, టీవీ, రంగస్థల నటుడు రాజబాబు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న రాజబాబు ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. రాజబాబుకు భార్య, ఇద్దరు కుమా రులు, కుమార్తె ఉన్నారు. రాజబాబును అందరూ బాబాయ్‌ అని ఆప్యాయంగా పిలుస్తారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రా పురం మండలం నరసాపురపేటలో 13 జూన్‌ 1957లో రాజబాబు జన్మించారు. ఆయన తండ్రి పేరు రామతారకం. ఆయన చిత్ర నిర్మాత, నటుడు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘స్వర్గం-నరకం’, ‘రాధమ్మ పెళ్లి’ సినిమాలను నిర్మించారు. కాకినాడలో స్థిరపడిన ఆయనకు వ్యవసాయం చేయడమన్నా, కబడ్డీ ఆడటమన్నా, రంగస్థల మీద నటించడమన్నా ఎంతో ఇష్టం. దర్శకుడు ఉప్పలపాటి నారాయణరావు రాజబాబును 1995లో ‘ఊరికి మొనగాడు’ అన్న సినిమాలో అవకాశం ఇచ్చి సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆ తరువాత ఆయన పలు సినిమాల్లో నటించారు. టీవీ రంగంలో కూడా రాజబాబు పలు సీరి యళ్లలో నటించారు. 2005లో ‘అమ్మ’ సీరియల్‌లోని పాత్రకు నంది అవార్డు వచ్చింది. రాజబాబును కాకినాడలో ఘనంగా సత్కరించారు. తెలుగుతనాన్ని తెరమీద పంచి తెర మెరుగైన రాజబాబు ఎప్పటికీ తన పాత్రల ద్వారా చిరంజీవిగా ఉంటారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img