Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జూన్‌ 9న నారాయణమూర్తి యూనివర్సిటీ

హైదరాబాద్‌: స్నేహ చిత్ర పిక్చర్స్‌ బ్యానర్‌లో పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. జూన్‌ 9న రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా నారాయణ మూర్తి మాట్లాడుతూ 10వ తరగతిలో పేపరు లీకేజీలు – గ్రూపు 1-2 లాంటి ఉద్యోగ పరీక్షల్లోనూ పేపరు లీకేజీలు ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్‌ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి? లంబకోణాలు నేర్పిన వాళ్ళే కుంభకోణాలు జేస్తూ ఉంటుంటే రెక్కలు తెగిన జ్ఞాన పావురాలు విలవిల కోట్టుకుంటూ ఊపిరాడక గింజు కుంటుంటే ఈ విద్యావ్యవస్థ, ఈ ఉద్యోగవ్యవస్థ నిర్వీర్యం కావాలా? కాకూడదు. మనది నిరుద్యోగ భారతం కాదు. ఉద్యోగ భారతం కావాలి అని చాటి చెప్పే చిత్రమే ఈ ‘‘యూనివర్సిటీ’’ రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్‌ 9న రిలీజ్‌ అవుతోంది అన్నారు. ఈ చిత్రానికి పాటలు గద్దర్‌, నిస్సార్‌, మోటపలుకులు రమేష్‌, వేల్పుల నారాయణ., గాయకులు గద్దర్‌, జల్డంకి సుధాకర్‌, సాయిచరణ్‌, గోస్కుల రమేష్‌, పల్లె నరసింహం. కథ-స్క్రీన్‌ ప్లే- మాటలు- సంగీతం -దర్శకత్వం-నిర్మాత ఆర్‌.నారాయణ మూర్తి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img