Friday, April 19, 2024
Friday, April 19, 2024

డైరెక్టర్‌ సుధా కొంగరకు గాయం

చెన్నై: దర్శకురాలు సుధా కొంగర గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్‌ వేదికగా అభిమానులకు తెలియచేశారు. ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాతో దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు సుధా కొంగర. సూర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి ఆమె ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పింది. తాజాగా ఆమె గాయపడ్డారు. చేతికట్టుతో ఉన్న ఫొటోలను షేర్‌ చేసిన సుధా.. చాలా చిరాకుగా, బాధగా ఉందని తెలిపారు. దెబ్బ కారణంగా నెలరోజులు షూటింగ్‌ నుంచి విరామం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. తాను ఇలా షూటింగ్‌ నుంచి బ్రేక్‌ తీసుకోవల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం సుధా బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌తో ఓ సినిమా చేస్తున్నారు. తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ పేరుతో విడుదలైన సినిమాను హిందీలో తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆమె ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా బయోపిక్‌ తెరకెక్కించనున్నారని ఇటీవల పలు వార్తలు వచ్చాయి. వాటిపై ఆమె స్పందిస్తూ.. ప్రస్తుతానికి ఆయన బయోపిక్‌ తెరకెక్కించే ఆలోచన లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img