Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

త్వరలో మరో మెగా హీరోతో సినిమా: బాబీ

హైదరాబాద్‌: ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకు న్నాడు దర్శకుడు బాబీ. చిరు అభిమాలనుకు మాస్‌ ఎంటర్‌టైనర్‌ను అందించిన ఈ డైరెక్టర్‌ ప్రస్తుతం ఆ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా గన్నవరం విమానా శ్రయంలో సందడి చేసిన బాబీ మీడియాతో మాట్లాడారు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని హిట్‌ చేసినందుకు మరోసారి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మా సినిమా విడుదలై నాలుగు వారాలవుతున్నా.. ఇప్పటికీ కలెక్షన్‌లు బాగా వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలతో పాటు విదేశాల్లోని తెలుగు వారు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. నా దర్శకత్వంలో నటించడానికి చిరంజీవి అంగీకరించడం నాకు పెద్ద బహుమతితో సమానం. ప్రస్తుతం మా చిత్రబృందమంతా సినిమా విజయోత్సవ సంబరాల్లో ఉంది. మెగా హీరోతో మరో సినిమా చేస్తున్నాను. త్వరలోనే దానికి సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడిస్తాను’ అని చెప్పారు. ఇక పవన్‌కల్యాణ్‌ గురించి బాబీ మాట్లడుతూ తన మద్దతు ఎప్పటికీ ఆయనకు ఉంటుందని ప్రకటించారు. ప్రస్తుతం ఈ వార్త హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే చిరంజీవితో, పవన్‌ కల్యాణ్‌లతో సినిమాలు తీసిన బాబీ తర్వాత ఏ మెగా హీరోతో పనిచేస్తారా అని నెటిజన్లు అనుకుంటున్నారు. ‘ఆ మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌’ అని మరికొందరు కామెంట్స్‌ పెడుతున్నారు. బన్నీకి కూడా ఓ కథ వినిపించినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img