Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

‘దసరా’లో సన్నివేశం తొలగించాలని ధర్నా

హైదరాబాద్‌: నేచురల్‌ స్టార్‌ నాని, కీర్తి సురేశ్‌ హీరో, హీరో యిన్‌గా నటించిన సినిమా ‘దసరా’. కొత్త దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం పాన్‌ ఇండియాగా రూపొందింది. అనేక భాషల్లో ప్రపంచవ్యాప్తంగా మార్చి 30న విడు దలైంది. ఈ మూవీ ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచే హిట్‌ టాక్‌ను తెచ్చు కుంది. బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ను రాబడుతుండగానే సినిమాలోని ఓ సన్నివేశంపై వివాదం రేగింది. కీర్తి సురేశ్‌ ‘దసరా’లో వెన్నెల అనే పాత్రను పోషించారు. అంగన్‌వాడీ టీచర్‌గా నటించారు. ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో కీర్తి సురేశ్‌ కోడిగుడ్లను దొంగతనం చేసి అమ్ముకుంటున్నట్టు చూపించారు. ఆ గుడ్లను తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు ఇచ్చినట్టు చిత్రీకరించారు. ఈ సీన్‌పై అంగన్‌వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని థియేటర్‌ వద్ద ధర్నా చేశారు. ఆ సీన్‌ను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు. సన్నివేశాన్ని తొలగించకపోతే సినిమాను ప్రదర్శిస్తున్న థియేర్స్‌ వద్ద నిరసనకు దిగుతామని హెచ్చరించారు. దసరా సినిమా వీర్లపల్లి అనే గ్రామం నేపథ్యంలో రూపొందింది. చిత్రంపై విడుదలకు ముందే భారీ బజ్‌ ఉంది. మూవీ ఆ అంచనాలను మించి రాణిస్తోంది. వరల్డ్‌ వైడ్‌గా రెండు రోజుల్లోనే రూ.53కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img