Friday, April 19, 2024
Friday, April 19, 2024

నయనతార ఫ్యాన్స్‌ ఆగ్రహం… వెనక్కి తగ్గిన నటి మాళవిక


చెన్నై: ‘మాస్టర్‌’ బ్యూటీ మాళవికా మోహనన్‌పై లేడీ సూపర్‌స్టార్‌ నయనతార ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను విమర్శిస్తూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అభిమానుల తీరుతో నిరాశకు గురైన మాళవిక చేసేది లేక.. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై వివ రణ ఇచ్చారు. అసలు ఇంతకీ ఏం జరిగిం దంటే..? తన కొత్త చిత్రం ‘క్రిస్టి’ ప్రమోషన్స్‌లో భాగంగా మాళవికా మోహనన్‌ ఓ మలయాళీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తనకు ‘లేడీ సూపర్‌స్టార్‌’ పిలుపంటే నచ్చదని, హీరోయిన్లను కూడా హీరోల మాదిరిగానే సూపర్‌స్టార్‌ అంటూ అభివర్ణించాలన్నారు. ఈ వ్యాఖ్యలపై నయనతార అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నయనతారను దృష్టిలో పెట్టుకునే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని భావించిన వాళ్లు.. మాళవికను విమర్శిస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో ఆమె తాజాగా వివరణ ఇచ్చారు. ‘‘నటీమణులందరినీ ఉద్దేశిస్తూ ఆ పదాన్ని ఉపయోగించి నా అభిప్రాయాన్ని బయటపెట్టాను. అంతేకానీ, కచ్చితంగా ఒక్క హీరోయిన్‌నే ఉద్దేశించి నేను మాట్లాడలేదు. నాకు నయనతార అంటే ఎంతో ఇష్టం. ఆమెను ఒక సీనియర్‌గా భావించి.. నటనపరంగా ప్రేరణ పొందుతాను. దయచేసి మీ అందరూ కాస్త శాంతించండి’’ అని క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img