Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నాకు పెళ్లి వయసు దాటిపోయింది: సల్మాన్‌ఖాన్‌

ముంబై: బాలీవుడ్‌ స్టార్‌హీరో సల్మాన్‌ఖాన్‌ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా? అని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పెళ్లి గురించి స్పందించారు. తనకు పెళ్లి చేసుకునే వయసు దాటి పోయిందన్నారు. ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డులు (ఐఫా) – 2023కు సంబంధించి మీడియా సమావేశం దుబాయ్‌లో జరి గింది. బీటౌన్‌ నుంచి సల్మాన్‌ఖాన్‌, అభిషేక్‌ బచ్చన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, నోరా ఫతేహి, విక్కీ కౌశల్‌ తదితరులు మీడియాతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఓ మహిళా అభిమాని సల్మాన్‌కు ప్రపోజ్‌ చేసింది. ‘సల్మాన్‌ మిమ్మల్ని చూసినప్పుడే నేను మీతో ప్రేమలో పడిపోయాను. ఈ విషయం మీతో చెప్పడం కోసం హాలీవుడ్‌ నుంచి ఇక్కడికి వచ్చాను’ అంటూ ఆమె తన ఇష్టాన్ని తెలపగా.. ‘మీరు షారుక్‌ ఖాన్‌ గురించి మాట్లాడు తున్నారు కదా!’ అని సల్లూబాయ్‌ జోక్స్‌ వేశారు. అనంతరం ఆమె..‘లేదు. నేను మిమ్మల్నే ప్రేమిస్తున్నాను. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?’ అంటూ తన మనసులో మాట బయటపెట్టింది. దీనిపై స్పందించిన సల్మాన్‌… ‘నాకు పెళ్లి వయసు దాటిపోయింది. 20 ఏళ్ల క్రితం నువ్వు నన్ను కలిసి ఉంటే బాగుండేది’ అని సరదాగా బదులిచ్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img