Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నాగచైతన్య ఓటీటీకి రెడీ

హైదరాబాద్‌ : టాలీవుడ్‌ స్టార్స్‌ ఒక్కొక్కరుగా ఓటీటీ బాట పడుతున్నారు. ఆసక్తికరమైన కథలుంటే వెండితెరపైనే కాదు ఓటీటీ మాధ్యమంలోనూ నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నవదీప్‌, సత్యదేవ్‌, సిద్దూ జొన్నలగడ్డ, తమన్నా, శ్రుతీహాసన్‌ వంటి తారలు వెబ్‌సిరీస్‌ల్లో మెరిశారు. ఇప్పుడు అక్కినేని నాగచైతన్య కూడా ఓటీటీలో అడుగుపెడుతున్నారు. ఓ హారర్‌ కథతో రూపొందనున్న సిరీస్‌లో ఆయన నటించనున్నారు. ఇందులో ఆయన నెగెటివ్‌ షేడున్న పాత్రలో కనిపించనున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ ‘‘అమెజాన్‌ ప్రైమ్‌లో కోసం చేస్తున్న ఈ సిరీస్‌కు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నేను నెగెటివ్‌ షేడున్న పాత్ర చేయడమేంటని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. హారర్‌ నేపథ్యంలో సవాల్‌ విసిరే పాత్ర ఇది. అందుకే ట్రై చేస్తున్నా. ఎప్పుడూ చేయని పాత్ర చేయడం కాస్త కొత్తగానే ఉంటుంది. కరోనాకి ముందు ప్రారంభం కావలసిన సిరీస్‌ ఇది. డిసెంబర్‌లో మొదలుపెడుతున్నాం’’ అని చైతూ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img