Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

‘నాటు నాటు’కు పాక్‌ నటి స్టెప్పులు

హైదరాబాద్‌: ప్రముఖ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’… ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చలనచిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్‌తోపాటు క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డును ఈ ఏడాది సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఏకంగా అస్కార్‌ బరిలో నిలిచింది. అయితే ఈ పాటకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ పాటకు పాకిస్తాన్‌ నటి తనదైన స్టైల్లో స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకుంది. పాకిస్తాన్‌లో టాప్‌ నటుల్లో ఒకరైన హనియా ఆమిర్‌ ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్‌ చేసింది. ఓ వివాహ వేడుకలో నటుడు సబూర్‌ అలీతో కలిసి స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img