Friday, April 19, 2024
Friday, April 19, 2024

‘నారప్ప’ పాత్రలో.. జీవించారు


: చిరంజీవి

‘నారప్ప’ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో వెంకటేష్‌ను గతంలో ఎన్నడూ చూడని రోల్‌లో చూసి అభిమానులు షాక్‌ అయ్యారు.తాజాగా ఈ సినిమాని మెగాస్టార్‌ చిరంజీవి అభినందించారు.‘నారప్ప’ పాత్రలో వెంకటేష్‌ నటించలేదు.. జీవించారు అంటూ కితాబు ఇచ్చారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికి ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రస్తుతం చిరు రివ్యూ ఇచ్చిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌, వి క్రియేషన్స్‌ బ్యానర్లు సంయుక్తంగా సమర్పించిన ఈ సినిమాకు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించారు. డి. సురేష్‌ బాబు నిర్మాతగా వ్యవహరించారు. వెంకటేష్‌ జోడీగా అందాల తార, సీనియర్‌ హీరోయిన్‌ ప్రియమణి నటించింది. రావు రమేష్‌, రాజీవ్‌ కనకాల కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ బాణీలు కట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img