Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నిరసనలూ నేరాలేనట…!

దేశ పౌరులు తమ సమస్యలపై నిరసన తెలిపే హక్కును రాజ్యాంగం కల్పించిందని ఇటీవల సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసింది. ఇలాంటివి బీజేపీ పాలకులకు రుచించవు. ఏడేళ్ల బీజేపీ పాలనలో హింసాత్మక సంఘటనలు దేశంలోని అనేక ప్రాంతాల్లో జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి. ఈ సంఘటనల్లో బాధితులే ఎక్కువగా నేరస్థులుగా కేసులు, శిక్షలు అనుభవిస్తున్నారు. అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం, దేశ ద్రోహ చట్టాల కింద అరెస్టయి ఏళ్ల తరబడి విచారణ సైతం లేకుండా జైళ్లలో మగ్గుతున్నారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు సృష్టించటంలో సంఘ పరివార్‌ దళాలు ఆరితేరాయి. అయినప్పటికీ ఈ దళాల్లో ఎవరిపైనా కేసులుండవు, శిక్షలుండవు. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హింసాయుత సంఘటనలు పరిపాటి అయింది. బీజేపీ నాయకులే కాదు ఎంతో బాధ్యతగా నడుచుకోవలసిన ఎంపీలు సైతం ఇష్టానుసారంగా, రౌడీలుగా మాట్లాడటం కనిపిస్తుంది. నిరసన తెలిపినా, తెలపకపోయినా హింసను సృష్టించటం, బహిరంగంగా బెదిరించిన సంఘటనలు రెండు బీజేపీ పాలిత త్రిపుర, హర్యానా రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి. త్రిపుర రాష్ట్ర ఉత్తర ప్రాంత జిల్లాల్లో ఉవ్వెత్తున మత ఘర్షణలు జరిగి మైనార్టీలు మత ప్రజలు అనేక విధాలుగా బాధితులయ్యారు. ప్రాణాలు, ఆస్తులు కోల్పోయారు. మసీదులూ ధ్వంసమయ్యాయి. బహు శాతం ఈ హింసను బంగ్లాదేశ్‌లో మైనార్టీ మతస్తులపై జరిగిన దాడులకు, ఆలయాల ధ్వంసానికి ప్రతీకారంగా ఇక్కడ మతాల మధ్య దుండగులు చిచ్చురేపారు. హింసాకాండను అడ్డూ అదుపు లేకుండా కొనసాగించారు. అసలు నిజాలు బయట పెట్టేందుకు నిజ నిర్థారణ కమిటీ కార్యకలాపాలు అడ్డుకొనేందుకూ, సోషల్‌ మీడియా ద్వారా హింసను ఖండిరచి, నిరసన తెలిపిన వారిపైన అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టాన్ని పోలీసులు ప్రయోగించారు. నిరసన తెలియజేయడము అక్రమం, దేశ ద్రోహం ఎలా అవుతుందో బీజేపీ, సంఘ పరివార్‌ దళాలకే తెలియాలి. హర్యానాలో దాదాపు 11 నెలలకు పైగా దుష్ట చట్టాల రద్దు కోరుతున్న రైతులు తాజా బీజేపీ ఎంపీ మనీష్‌ గ్రోవర్‌ను ఘెరావ్‌ చేశారు. రైతుల ఉద్యమం పట్ల హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ అనేక మార్లు సభ్య సమాజం మెచ్చని విధంగా రైతులను దూషించారు. అరెస్టులూ చేయించారు. గ్రోవర్‌ హర్యానా రోప్‌ాతక్‌ జిల్లా కిలోయ్‌ గ్రామ ఆలయంలో ఉండగా రైతులు చుట్టుముట్టి దిగ్బంధం చేశారు. దాదాపు ఎనిమిది గంటలు గ్రోవర్‌ను ఘెరావ్‌ చేశారు. రైతులు ‘పని పాటలేని తాగుబోతులు, దుష్టశక్తులు’ అంటూ నోటికి వచ్చినట్టుగా మాట్లాడారు. దీనిపై ఆగ్రహం చెందిన రైతులు గ్రోవర్‌ను ఆలయంలో దిగ్బంధించారు. ప్రజా సంక్షేమం కోసం పని చేయవలసిన ఎంపి రైతులను దూషిస్తే ఖండిరచినవారూ దేశ ద్రోహులవుతున్న పరిణామాలు బీజేపీ పాలనలో అపరిమితమవుతున్నాయి. ఈ ఘటనపై రోప్‌ాతక్‌ నుండి ఎన్నికైన బీజేపీ అర్వింద్‌శర్మ నోటికి అడ్డుఅదుపూ లేనట్టుగా రెచ్చిపోయాడు. గ్రోవర్‌ను వ్యతిరేకించే వారి ‘కళ్లు పీకేస్తాను, చేతులు నరికేస్తా’ అంటూ పరోక్షంగా కాంగ్రెస్‌ను బెదిరించాడు. రైతుల ఉద్యమానికి కాంగ్రెస్‌ తన మద్దతు తెలియజేస్తున్నందున బీజేపీ నాయకులు దుర్మార్గమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. గ్రోవర్‌ తాను చేసిన అవాంఛనీయ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన తర్వాతనే రైతులు ఆలయం నుండి బయటికి రావడానికి అనుమతించారు. రెండుచేతులూ జోడిరచి నమస్కరిస్తూ గ్రోవర్‌ బయటకు వచ్చారు. అయితే తాను క్షమాపణలు చెప్పలేదని, నమస్కరించలేదని గ్రోవర్‌ ఆ తర్వాత చెప్పిన విషయాన్ని సైతం అర్వింద్‌ శర్మ విస్మరించి దూషణలకు పూనుకోవడం ఆయన స్థాయికి ఎంత మాత్రం తగింది కాదు.
మూడు దుష్టచట్టాలను తాము ఎంతమాత్రం సమ్మతించబోమని దేశ వ్యాప్తంగా రైతులుగతంలో ఏనాడూ ఎరుగనివిధంగా పోరాటం చేస్తున్నప్పటికీ మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇటీవల యూపీలో కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా రైతులను కారుతో తొక్కించి నలుగురు రైతులను పొట్టన పెట్టుకున్నా బీజేపీ ప్రభుత్వాలు రైతులనే నిందించడం దుర్మార్గం. త్రిపుర హింసను సోషల్‌ మీడియా ద్వారా ఖండిరచినందుకు 102 మందిపైన అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం అక్కడి పోలీసులు మోపారు. ట్విటర్‌లో అకౌంటున్న 68 మంది, ఫేస్‌బుక్‌లో అకౌంటు గల 33 మంది, యూట్యూబ్‌ ఉన్న ఇద్దరిపైన త్రిపుర పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. వీరిలో దిల్లీకి చెందిన ఇద్దరు న్యాయవాదులు అన్సారి ఇండోరి, మఖేష్‌లున్నారు. వీరు స్వతంత్ర నిజ నిర్థారణ కమిటీలో ఉండటమే వీరు చేసిన తప్పు. సోషల్‌ మీడియా ద్వారా ఖండిరచటం వల్ల మత ఘర్షణలు పెరుగుతాయన్న పోలీసులు అధికారులు ఎవరి పక్షాన ఉన్నారు? హిందూత్వ శక్తులు విచ్చలవిడిగా దాడులు చేసి హింసాకాండ సృష్టించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసులు బ్రిటీషు పాలనలో పనిచేసిన పోలీసుల బాటలోనే నడుస్తున్నారనుకోవాలి. ‘గుజరాత్‌ హింస’ నమూనాను త్రిపురలోనూ అమలు చేయాలని పరివార్‌ శక్తుల ఆలోచన ఈ హింసాకాండ వెనుక ఉందని గట్టిగా అనుమానించవలసివస్తోంది. పోలీసులు ప్రత్యేకంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనుసరిస్తున్న కర్కోటక పద్ధతులు ఇతర రాష్ట్రాల్లో అంతగా కనిపించవు. బహుశా పాలక బాస్‌లు అక్కడి పోలీసులకు ప్రత్యేకంగా మత బోధన శిక్షణ ఇచ్చి ఉండవచ్చు. ప్రజలకు అండగా నిలవవలసిన పోలీసులు పాలకుల కనుసన్నల్లో పనిచేయడం చాలా కాలంగా ఉన్నప్పటికీ బీజేపీ పాలనలో ఈ వికృతం అపారంగా పెరిగినట్టు కనిపిస్తోంది. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో హింసాకాండను సృష్టించి మతాల ప్రాతిపదికగా ఓట్లుపొంది ప్రయోజనంపొందడం నేడు కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న పార్టీకి బాగా అలవాటైన ప్రక్రియ. ఇలాంటి పాలకులకు ప్రజలే ఎన్నికల ద్వారా తగిన జవాబు చెప్పాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img