Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

పుష్పరాజ్ కోసం బరిలో దిగిన జులాయి విలన్?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం బహుభాషల్లో పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే పోస్టర్లు టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. `పుష్ప` రాజ్ పాత్రలో బన్నీ లుక్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. గంధపు దుంగల స్మగ్లర్ పాత్రలో బన్ని ఊర మాస్ లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కోసం బన్నీ ఎంతగా కష్టపడుతున్నాడన్నది అర్థమవుతుంది. ఈ సినిమాతో బన్నీ మరోసారి దర్శకుల హీరోగా నిరూపించుకున్నారు. ఇక ఈ సినిమాలో బన్నీ పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్ తో ఆకట్టుకోనుందని తెలుస్తోంది. ఇక ఊహించని ట్విస్టుతో పాజిటివ్ యాంగిల్ ని ఎలా ఎలివేట్ చేస్తారు? అన్నది కూడా ఇప్పటికి సస్పెన్స్. ఈ చిత్రంలో బన్నీ ని ఢీకొట్టే బలమైన ప్రత్యర్ధి ఎవరు? .. అంటే ఓ ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ ఓ విలన్ గా కనిపిస్తారు. అతడితో పాటు మరో ఆసక్తికర పేరు తెరపైకి వచ్చింది. అతనే బాలీవుడ్ నటుడు సోనుసూద్. ఇందులో బన్నీకి ధీటైన విలన్ గా సోనుసూద్ ని ఎంపిక చేసినట్లు ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే ఈ కాంబినేషన్ అల్టిమేట్ పోరాటాలతో రక్తి కట్టించడం ఖాయం అనాల్సిందే. గతంలో ఇదే కాంబినేషన్ లో `జులాయి` వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఇద్దరి పాత్రలు పోటా పోటీగా సాగుతాయి. తాజాగా పుష్పలో అంతకు మించి యాక్షన్ కమ్ థ్రిల్లర్ కాబట్టి కలయిక క్రేజీగానే ఉంటుందనడంలో సందేహమేం లేదు. ప్రస్తుతం సోనుసూద్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న `ఆచార్య`లో నటిస్తున్నారు. ఇందులో అతనిది చాలా పవర్ ఫుల్ పాత్ర అని తెలుస్తోంది. ఇంకా ఆయన పలు బాలీవుడ్ సినిమాలతోనూ బిజీగా ఉన్నారు. ఇక పుష్ప చిత్రీకరణ క్లైమాక్స్ లో ఉంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయింది. బ్యాలెన్స్ కూడా పూర్తి చేసి సుకుమార్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అవ్వాలని చూస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img