Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

‘పుష్ప 2’ టీజర్‌ వచ్చేసింది


హైదరాబాద్‌: సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘పుష్ప’ సినిమా పార్ట్‌1 బాక్సాఫీస్‌ వద్ద ఏ స్థాయిలో విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్‌ క్రేజ్‌ పాన్‌ ఇండియా స్థాయికి వెళ్లింది. కాగా సినీప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప’ పార్ట్‌2. సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి విడుద లైన గ్లింప్స్‌తో అంచనాలు రెట్టింపయ్యాయి. కాగా ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్బంగా శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. తాజాగా విడుదలైన వీడియో ఈ చిత్రంపై అంచనాలను రెట్టింపు చేసింది. ఇందులో బన్నీ సరికొత్త అవతారంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఎనిమిది బుల్లెట్‌ గాయాలతో శేషాచలం అడవిలోకి తప్పించుకోపోయిన పుష్ప రాజ్‌ కోసం అటు పోలీసులు, ఇటు మీడియా సెర్చింగ్‌ అంటూ ఉత్కంఠను క్రియేట్‌ చేశారు మేకర్స్‌. వేర్‌ ఈజ్‌ పుష్ప… హంట్‌ బిఫోర్‌ రూల్‌ అంటూ ఇటీవల విడుదలైన గ్లింప్స్‌ వీడియో సినీ ప్రియులను ఆకట్టుకోగా… తాజాగా విడుదలైన వీడియోకు మంచి స్పందన వస్తోంది. ఇందులో బన్నీకి జోడిగా రష్మిక మందన్నా నటిస్తుండగా, మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌, అనసూయ, సునీల్‌ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img