హైదరాబాద్ : విశ్వనటుడు కమల్‌హాసన్ కుమార్తె శృతిహాసన్ నటన, డ్యాన్సింగ్, సింగింగ్..ఇలా మల్టీటాలెంటెడ్ నటిగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అలాగే, తెలుగులోనూ స్టార్ హీరోల చిత్రాల్లోనూ నటించింది. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ శృతిహాసన్… సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ప్రస్తుతం తన ప్రియుడుతో కలిసి ముంబైలో నివసిస్తున్న శృతి… బాక్సింగ్‌లో శిక్షణ పొందుతున్న వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె ఉన్నట్టుండి బాక్సింగ్ శిక్షణ ఎందుకు తీసుకుంటోందో తెలియదు. గతంతో హీరోయిన్లు నివేదా పేతురాజ్, సమీరా రెడ్డి, రకుల్ ప్రీత్ సింగ్ ఈ తరహా శిక్షణ తీసుకున్నారు.