Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

భారీ మొత్తానికి ‘ఏజెంట్‌’ పంపిణీ హక్కులు

హైదరాబాద్‌: ఏజెంట్‌గా సందడి చేసేందుకు అఖిల్‌ అక్కినేని రెడీ అవుతున్నాడు ఈ సినిమాకు విడుదలకు ముందే భారీగా బిజినెస్‌ జరుగుతున్నట్టు సమాచారం. ఆంధ్రా, నైజాం, సీడెడ్‌ ఏరియాల్లో కలిపి ఏజెంట్‌ సినిమా పంపిణీ హక్కులు సుమారు రూ.35 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలిసింది. గాయత్రి దేవి ఫిలిమ్స్‌ వైజాగ్‌ ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్‌ సతీశ్‌ తెలుగు రాష్ట్రాల్లో ఇంత భారీ మొత్తానికి ఏజెంట్‌ థ్రియాట్రికల్‌ హక్కులు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌ టైన్‌మెంట్స్‌, సురేందర్‌ 2 సినిమా బ్యానర్లపై అనిల్‌ సుంకర, సురేందర్‌రెడ్డి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. కోలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ హిప్‌ హాప్‌ తమిజా సంగీతం అందిస్తుండగా.. వక్కంతం వంశీ కథనందిస్తున్నారు. యాక్షన్‌ ఓరియెంటెడ్‌ కథాంశంతో సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మోడల్‌ సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఏజెంట్‌ ఏప్రిల్‌ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రధాన భారతీయ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తుండగా, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img