హైదరాబాద్ : పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబి నేషన్‌లో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ‘భీమ్లా నాయక్’ చిత్రం నుంచి ‘రానా’ పరిచయ టీజర్‌ను ‘బ్లీట్జ్ ఆఫ్ డేనియల్ శేఖర్’ పేరుతో సోమవారం సాయంత్రం చిత్ర యూనిట్ విడుదల చేసింది. డేనియల్ శేఖర్‌గా రానా పోషి స్తున్న పాత్ర స్వరూప, స్వభా వాలు, తీరు తెన్నులు ఎలా ఉంటాయన్నది ఈ బ్లీట్జ్లో చూపించారు. ‘భీమ్లా నాయక్’గా చేస్తున్న పవన్ కల్యాణ్ ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం, మీసం తిప్పడం వంటి సన్నివేశాలు ఈ టీజర్లో హైలెట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను జరుపు కుంటోంది. ఈ సందర్భంగా తమ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోందని, 2022 జనవరి 12న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. పవన్ కల్యాణ్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా.. రానా సరసన మరో మలయాళ భామ సంయుక్తా మీనన్ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, సంభాషణలు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తుండగా, సాగర్ కె చంద్ర దర్శకుడు. ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.