Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

‘భీమ్లా నాయక్‌’ సాంగ్‌ వచ్చేసింది

హైదరాబాద్‌ : పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా గురువారం ‘భీమ్లా నాయక్‌’ చిత్ర బృందం ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి దీనిని రాయగా, తమన్‌ స్వరాలు కూర్చారు. పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు నాడు ఈ పాటను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని దర్శకుడు క్రిష్‌ (రాధాకృష్ణ జాగర్లమూడి) ట్వీట్‌ చేశారు. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా విడుదలైన ఈ పాట వీడియోలోతమన్‌, శ్రీకృష్ణ, పృథ్వీ చంద్ర, రామ్‌ మిరియాల తదితరులు కనిపిస్తున్నారు. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన అయ్యప్పనుమ్‌ కోషియం చిత్రాన్ని తెలుగులో ‘భీమ్లా నాయక్‌’ పేరిట పునర్నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌తోపాటు రానా దగ్గుబాటి, నిత్యమేనన్‌, ఐశ్వర్య రాజేశ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ స్క్రీన్‌ప్లే అందిస్తుండటం విశేషం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ దీనిని నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img