Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

మళ్లీ మారిన ఎఫ్‌`3 రిలీజ్‌ డేట్‌

హైదరాబాద్‌: విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న నవ్వుల విందు ‘ఎఫ్‌ 3’. ‘సమ్మర్‌ సోగ్గాళ్లు’ ట్యాగ్‌ లైన్‌తో రాబోతున్న ఈ సినిమా సూపర్‌ హిట్‌ ‘ఎఫ్‌ 2’ చిత్రానికి సీక్వెల్‌ అన్న సంగతి తెలిసిందే. మొదటిభాగంలోని పాత్రల్నే కంటిన్యూ చేస్తూ డిఫరెంట్‌ కథాంశంతో సినిమాని రూపొందిస్తున్నారు. సునీల్‌ పాత్ర అదనంగా చేరింది. కరోనా కారణంగా పలు మార్లు విడుదల తేదీని వాయిదా వేసుకున్న ఈ సినిమాని సమ్మర్‌ కానుకగా ఈ ఏడాది ఏప్రిల్‌ 28న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఏప్రిల్‌ 29న మెగాస్టార్‌ చిరంజీవి ‘ఆచార్య’ విడుదలవుతుండడంతో ‘ఎఫ్‌ 3’ చిత్రానికి మరో కొత్త డేట్‌ ను మేకర్స్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. సినిమాను మే 27న విడుదల చేయబోతున్నారు. ఇక ఈ తేదీలో ఎలాంటి మార్పులు ఉండబోవని నిర్మాతలు కన్ఫర్మ్‌ చేశారు. ‘పిల్లలు.. పరీక్షలు ముగించుకోండి.. పెద్దలు సమ్మర్‌ సందడికై తయారుకండి.’ అంటూ ఈ ఫన్‌ పిక్నిక్‌ డేట్‌ను కన్ఫర్మ్‌ చేశారు. మొదటి భాగం అద్భుతమైన విజయం సొంతం చేసుకోవడంతో.. రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డబ్బు చుట్టూ తిరిగే కథాంశంతో ఈసారి తోడు దొంగల్లాంటి తోడల్లుళ్లు .. నవ్వులు పూయించబోతున్నారు. రేచీకటితో వెంకీ, నత్తితో వరుణ్‌ తేజ్‌ అభిమానులకి హిలేరియస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వబోతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img