Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

‘వారెవ్వా జతగాళ్లు’ పోస్టర్‌ ఆవిష్కరణ


విశాలాంధ్ర-సామర్లకోట: తమిళనాడులో జరిగిన ఒక యదార్థ గాధ ఆధారంగా రూపొందించిన చిత్రమే ‘వారెవ్వా జతగాళ్లు’ చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం స్థానిక బ్రౌన్‌ ప్లాట్‌ సెంటర్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, ఇతర ప్రముఖులు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశం చిత్ర దర్శకుడు సలాది సత్య మాట్లాడుతూ… ఎవరు ఊహించని రీతిలో తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఒక యదార్థ గాధను తెరకెక్కించినట్లు తెలిపారు. ఒక గ్రామంలో అల్లరి చిల్లరగా తిరిగే నలుగురు స్నేహితులు … అదే గ్రామ ప్రజల చేత ‘వారెవ్వా జతగాళ్లు’ అని పిలిపించుకునే రీతిలో సాధించిన విజయగాథపై ఈ చిత్రాన్ని నిర్మించినట్లు చెప్పారు. కామెడీ, ఎమోషన్‌, సెంటిమెంట్‌ అన్ని అంశాలను కలగలిసి ఉంటాయన్నారు. ఈ చిత్రం గ్రాఫిక్స్‌ దాదాపుగా పూర్తవుగా ప్రస్తుతం చిత్రం సెన్సార్‌ బోర్డులో ఉందన్నారు. త్వరలోనే విడుదలయ్యే ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరారు. పెద్దాపురం మహారాణి కాలేజీలో చదువుకున్న తాను ఇదే కళాశాలలో ఫిలిం అకాడమీ నిర్వహిస్తూ అనేకమంది పేద కళాకారులను ప్రోత్సహిస్తున్నానని తెలిపారు. ఈ సినిమాలో హీరో లక్ష్మణ్‌ మాట్లాడుతూ… చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి గల తాను అనేకసార్లు హైదరాబాదులో జరిగిన ఫిల్మ్‌ ఎడిషన్లలో పాల్గొని నిరాశ చెందినట్లు చెప్పారు. చివరగా దర్శకుడు సత్య తనను ప్రోత్సహించి 7 నెలల పాటు నటనలో శిక్షణ ఇచ్చి హీరోని చేయడం గర్వంగా ఉందన్నారు. తనకు వచ్చిన అవకాశాన్ని తాను సద్వినియోగపరచుకున్నట్టు ఆయన తెలుపుతూ ఈ సినిమా మంచి ఆదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకుడు కేబీ ఆనంద్‌, రాష్ట్ర కార్మిక సంఘం నాయకులు దవులూరి సుబ్బారావు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఉబా జాన్‌ మోజేష్‌, కౌన్సిలర్లు, కళాకారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img