Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

విశ్వసేన్‌ ‘గామి’ టీజర్‌ విడుదల

హైదరాబాద్‌ : యంగ్‌ హీరో విశ్వసేన్‌ కొత్త తరహా చిత్రాలతో వచ్చి మంచి క్రేజ్‌ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఇప్పుడు మరో వైవిధ్యమైన సినిమాలో నటిస్తున్నాడు. ‘గామి’ అనే వెరైటీ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీ నుంచి తాజాగా టీజర్‌ను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. హై టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో ఈ చిత్రాన్ని వి సెల్యులాయిడ్‌, కార్తీక్‌ శబరిష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విద్యాధర్‌ కాగిట ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా వదిలిన టీజర్‌ చూస్తుంటే విశ్వసేన్‌ ఈ మూవీతో ఓ ప్రయోగం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇందులో విశ్వసేన్‌ సరసన చాందిని చౌదరి, అభినయ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే మేకర్స్‌ వెల్లడిరచనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img