Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

వేగంగా ‘ఇండియన్‌2’ చిత్రీకరణ

చెన్నై: ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ హీరోగా భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్‌2 సినిమా చిత్రీకరణ వేగంగా సాగుతోంది. ప్రస్తుతం తమిళనాడులోని కల్పాక్కమ్‌ డచ్‌ పోర్టులో షూటింగ్‌ కొనసాగుతోంది. కమల్‌హాసన్‌తోపాటు ఇతర నటీనటులపై వచ్చే కీలక యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే యాక్షన్‌ అండ్‌ స్టంట్‌ డిజైనింగ్‌ టీమ్‌తో కమల్‌హాసన్‌ చర్చిస్తున్న ఫొటో ఒకటి నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తుండగా, తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితులైన బాబీ సింహా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా భవానీ శంకర్‌, సముద్రఖని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియన్‌`2 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌-రెడ్‌ జియాంట్‌ మూవీస్‌ బ్యానర్లపై ఉదయనిధి స్టాలిన్‌, సుభాస్కరన్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. కమల్‌హాసన్‌ నటించిన విక్రమ్‌ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించిన అనిరుధ్‌ రవిచందర్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img