Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

షూటింగ్ లో ప్రకాశ్ రాజ్ కు గాయాలు

విలక్షణ నటుడు.. పాత్ర ఏదైనా సరే.. అందులో పరకాయ ప్రవేశం చేసే ప్రకాశ్ రాజ్ షూటింగ్ లో గాయపడ్డారు. ఈ రోజు (మంగళవారం) చెన్నైలో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొన్న ఆయన ప్రమాదానికి గురయ్యారు. తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న చిత్రంలో ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన గాయపడ్డారు. పలు చోట్ల స్వల్ప గాయాలకు గురైనట్లు చెబుతున్నారు. చేతితో పాటు పలు చోట్ల స్వల్ప గాయాలు అయినట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయన తన షూటింగ్ ను ఆపేసి.. హైదరాబాద్ బయలుదేరారు. ఇదే విషయాన్ని ప్రకాశ్ రాజ్ తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తనకు చిన్న చిన్న గాయాలు అయ్యాయని.. తాను హైదరాబాద్ లో సర్జరీ చేయించుకున్నట్లు వెల్లడించారు. ప్రమాదం జరిగిన తర్వాత చెన్నై నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన ప్రకాశ్ రాజ్.. సన్ షైన్ ఆసుపత్రి లో శస్త్ర చికిత్స చేయించుకోనున్నారు. ‘‘చిన్న ఫ్యాక్చర్ జరిగింది. నేను బాగున్నాను. చింతించాల్సిన అవసరం లేదు. నా స్నేహితుడు డాక్టర్ గురువారెడ్డి సర్జరీ చేయనున్నారు’’ అని వెల్లడించారు. తెలుగుతో పాటు తమిళ.. హిందీ.. కన్నడ చిత్రాల్లో నటిస్తున్న ప్రకాశ్ రాజ్ ఈ మధ్యనే ‘మా’ అధ్యక్ష స్థానానికి పోటీ చేయనున్నట్లు చెప్పటం.. దీనికి సంబంధించి తన టీంను ప్రకటించటం తెలిసిందే. ‘మా’ ఎన్నికల ఎపిసోడ్ కు సంబంధించి ఈ మధ్య తరచూ వార్తల్లో కనిపిస్తున్న ప్రకాశ్ రాజ్ అనూహ్యంగా గాయపడ్డారు. గాయాల తీవ్రత లేకపోవటంతో.. ఆయన శ్రేయోభిలాషులు ఊపిరి పీల్చు కుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img